నరసరావుపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భోపాల్ ఎయిమ్స్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరు చెందిన గోపి తన కుటుంబంతో కలిసి ఒక లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబంలో ఉన్న 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనలో తల్లీ, కూతురు నిన్ననే మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news