దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మైసూరులో శ్రీనివాస్ లూయిస్ (47)ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడు స్కూళ్లు, హైకోర్టులు, ప్రభుత్వ భవనాల్లో బాంబులు పెట్టినట్లు పేర్కొంటూ 1,100కు పైగా బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు గుర్తించారు.
అధికారుల ప్రకారం, నిందితుడు పీజీ చదివిన నిరుద్యోగిగా ఉన్నాడు. ప్రాథమిక సమాచారం మేరకు అతను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధించి పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news