విశాఖపట్నం గాజువాకలో గ్యాస్ సిలిండర్లను మోసం చేసి పరారైన డెలివరీ బాయ్ అప్పారావును పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్లతో వరుసలు కలిపి ఓటీపీ తీసుకుని గ్యాస్ సిలిండర్లను మాయం చేసినట్లు మణికంఠ ఏజెన్సీ ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన గాజువాక పోలీసులు అప్పారావు 30 సిలిండర్లతో పరారైనట్లు గుర్తించారు. గాజువాక ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ పార్థసారథి వివరాల ప్రకారం నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news