వెనిజులాలో సంభవించిన భారీ ద్వంద్వ భూకంపాలు హృదయ విదారక ఘటనకు కారణమయ్యాయి. అమెరికా నుంచి ఇటీవలే బహిష్కరించబడిన వంద మందికి పైగా వెనిజులా పౌరులను తాత్కాలికంగా ఒక హోటల్లో ఉంచిన కొద్ది గంటలకే ఆ భవనం భూకంపాల ధాటికి కుప్పకూలింది. దీంతో వారిలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోగా, ప్రాణాలతో బయటపడిన వారు ఆ భయానక క్షణాలను వివరిస్తూ సహాయక చర్యల్లో జరిగిన ఆలస్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమాచారం ప్రకారం, అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 146 మంది వెనిజులా పౌరులు ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు పూర్తయ్యే వరకు వారిని లా గువైరా ప్రాంతంలోని ఒక హోటల్లో ఉంచారు. అయితే అదే ప్రాంతాన్ని వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రతల భూకంపాలు వణికించాయి. భారీ ప్రకంపనలతో హోటల్ పూర్తిగా కూలిపోవడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా శిథిలాల కింద చిక్కుకున్నారు
ప్రాణాలతో బయటపడిన పలువురు తమ కళ్లముందే గోడలు కూలిపోయాయని, దట్టమైన దుమ్ము మధ్య కేకలు, అరుపులు మాత్రమే వినిపించాయని చెప్పారు. కొందరు శిథిలాల మధ్య గంటల తరబడి చిక్కుకుపోయి తరువాత స్థానికులు, సహాయక సిబ్బంది సాయంతో బయటపడ్డారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
బహిష్కరణకు గురైన పలువురు వ్యక్తుల గుర్తింపు పత్రాలు, సెల్ఫోన్లు ముందుగానే అధికారుల వద్ద ఉండటంతో వారి వివరాలను గుర్తించడం, కుటుంబాలకు సమాచారం అందించడం మరింత క్లిష్టంగా మారిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమ బంధువులు ప్రాణాలతో ఉన్నారా, శిథిలాల కింద ఉన్నారా అనే సమాచారం కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Fetching videos...
Fetching latest news...
No trending news