అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో ‘సన్‌సెట్ క్లాజ్’ ఒకటి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కుదురుతున్న వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఈ నిబంధనపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒకసారి కుదిరిన వాణిజ్య ఒప్పందం నిరవధికంగా కొనసాగకుండా, నిర్దిష్ట కాలం పూర్తయ్యాక స్వయంచాలకంగా ముగిసేలా లేదా మళ్లీ సమీక్షించి పునరుద్ధరించేలా చేసే నిబంధననే ‘సన్‌సెట్ క్లాజ్’గా పి సాధారణంగా చాలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అనేక సంవత్సరాల పాటు అమలులో ఉంటాయి. అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, సుంకాల విధానం, ఉత్పత్తి వ్యయం, ఉద్యోగాల పరిస్థితి, దేశీయ పరిశ్రమల ప్రయోజనాలు కాలక్రమేణా మారుతుంటాయి. అలాంటి సందర్భాల్లో పాత ఒప్పందాలు దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేకపోతే వాటిని మార్చుకునే అవకాశం ఉండాలని అమెరికా కోరుతోంది. అందుకే సన్‌సెట్ క్లాజ్‌ను ఒప్పందాల్లో చేర్చాలని ట్రంప్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. లుస్తారు. ఈ విధానం ద్వారా ఒప్పందం శాశ్వతంగా కాకుండా కాలానుగుణంగా పునఃసమీక్షకు వస్తుంది
ఈ నిబంధన ప్రకారం ఒప్పందంలో ముందుగానే ఒక గడువు నిర్ణయిస్తారు. ఆ గడువు పూర్తయిన తర్వాత సంబంధిత దేశాలు మళ్లీ సమావేశమై ఒప్పందాన్ని కొనసాగించాలా, సవరించాలా లేదా పూర్తిగా ముగించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాయి. అన్ని దేశాలు అంగీకరిస్తే ఒప్పందం పొడిగించబడుతుంది. అంగీకారం లేకపోతే అది గడువు ముగిసినట్లే పరిగణించబడుతుంది. దీనివల్ల ప్రతి దేశానికి తమ ఆర్థిక ప్రయోజనాలను మళ్లీ అంచనా వేసుకునే అవకాశం లభిస్తుంది.
ట్రంప్ వాణిజ్య విధానంలో అమెరికా పరిశ్రమలు, తయారీ రంగం, ఉద్యోగాల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. అందువల్ల ఏ వాణిజ్య ఒప్పందమైనా అమెరికాకు నిరంతర ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని ఆయన ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో పరిస్థితులు మారితే ఒప్పందాలను సవరించేందుకు సన్‌సెట్ క్లాజ్ ఉపయోగపడుతుందని అమెరికా వాదిస్తోంది. దీనివల్ల అమెరికా చర్చల్లో మరింత బలమైన స్థితిలో ఉండగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news