ప్రపంచ సాంకేతిక రంగంలో చైనాకు నిజమైన పోటీని ఇవ్వగలిగే దేశం భారత్ మాత్రమేనని అమెరికా ఉన్నతాధికారులు ప్రశంసించారు. వాషింగ్టన్లో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ సదస్సులో అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ Jacob Helberg మాట్లాడుతూ, భారీ ఇంజినీరింగ్ నైపుణ్యం, సాంకేతిక ప్రతిభ, యువశక్తి పరంగా భారత్ ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో ఉందన్నారు. కృత్రిమ మేధస్సు, ఆవిష్కరణలు, డిజిటల్ అభివృద్ధి రంగాల్లో భారత్ వేగంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు.
అమెరికా-భారత్ కలిసి ఒక ఉమ్మడి డెవలపర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఏఐ ఆధారిత భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భాగస్వామిగా మారనుందని, అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు.
అమెరికా సెనేటర్ Steve Daines కూడా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ స్థాయిలో చైనా ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే శక్తి భారత్-అమెరికా భాగస్వామ్యానికే ఉందన్నారు. అమెరికా సమాజ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చైనాకు వెళ్లినప్పుడు తన మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్లనని, కానీ భారత్‌కు వచ్చినప్పుడు పూర్తి విశ్వాసంతో ఉపయోగిస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో భారత్ పెరుగుతున్న ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news