ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్, అతని తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్, అలాగే కుటుంబ డ్రైవర్‌పై ఒక యువకుడు దాడి ఆరోపణలు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎఫ్ఐఆర్ ప్రకారం, బాధితుడు విపేంద్ర సింగ్ రేవా ప్రాంతానికి చెందినవాడు. అతను శైలేంద్ర సింగ్ కుటుంబంలో వంట మనిషిగా పనిచేస్తున్న సమయంలో వివాదం తలెత్తిందని పేర్కొన్నాడు. పని సమయంలో తన మొబైల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులు తీసుకున్నారని, తిరిగి ఇవ్వమని కోరిన తర్వాత గొడవ ప్రారంభమైందని ఆరోపించాడు.
ఫోన్ విషయంలో జరిగిన వాదన తర్వాత, శశాంక్ సింగ్, అతని తండ్రి మరియు డ్రైవర్ కలిసి తనపై దాడి చేసి గదిలోకి చొరబడి దూషించారని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా తనను ఇంటి నుంచి బలవంతంగా బయటకు గెంటేశారని, అలాగే తన ఖాతా నుండి డబ్బు కూడా బదిలీ చేయించుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇరు పక్షాల వాంగ్మూలాలు సేకరిస్తున్నామని, వాస్తవాలు నిర్ధారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news