నటి ఎస్తేర్ నొరోన్హా తన వ్యక్తిగత జీవితం, విడాకులు మరియు పెళ్లి నిర్ణయాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, సమాజంలో పెళ్లిపై ఉన్న ఒత్తిడే చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడింది.
25 లేదా 30 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాలనే సామాజిక ఒత్తిడి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె అన్నారు. “నాకు కూడా ఒక రిలేషన్ ఉండాలి” అనే భావన చాలామందిని తప్పు నిర్ణయాల వైపు నడిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఒత్తిడి వల్లే విడాకుల సంఖ్య కూడా పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
తన విడాకులను “డామేజ్ కంట్రోల్”గా భావిస్తున్నానని ఎస్తేర్ తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారకముందే తాను సరైన నిర్ణయం తీసుకున్నానని, అది తన జీవితానికి మంచి పాఠంగా మారిందని చెప్పారు. సంబంధాలు కేవలం భావోద్వేగాలపై ఆధారపడవని, అవి చాలా క్లిష్టమైనవని ఆమె అన్నారు.
కెరీర్లో విజయం సాధించవచ్చుగానీ, వ్యక్తిగత సంబంధాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఎస్తేర్ అభిప్రాయపడ్డారు. సమాజపు ఒత్తిడికి లోనై సంబంధాల్లో ఇరుక్కోవడం కంటే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదని ఆమె స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news