ప్రపంచ ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ తన తయారీ విధానంలో కృత్రిమ మేధస్సుపై అతిగా ఆధారపడటం వల్ల నాణ్యత పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నట్లు అంగీకరించింది. సంస్థ ఉపాధ్యక్షుడు చార్ల్స్ పూన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా అనుభవజ్ఞులైన ఇంజినీర్ల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, అదే పెద్ద తప్పిదంగా మారిందని ఆయన ఒప్పుకున్నారు
ఫోర్డ్ గత కొన్నేళ్లుగా తయారీ ప్రక్రియలో నాణ్యత తనిఖీల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత స్వయంచాలక వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించింది. ఈ వ్యవస్థలు లోపాలను ముందుగానే గుర్తించి ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరుస్తాయని కంపెనీ భావించింది. అయితే ఆచరణలో అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని సంస్థ వెల్లడించింది. స్వయంచాలక వ్యవస్థలు గుర్తించలేని అనేక లోపాలను అనుభవజ్ఞులైన ఇంజినీర్లు మాత్రమే గుర్తించగలరని తర్వాత కంపెనీ గ్రహించింది
Fetching videos...
Fetching latest news...
No trending news