భారత ఎన్నికల సంఘం దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, మేఘాలయ రాష్ట్రాల్లో జూన్ 30 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఓటరు జాబితాలో ఉన్న వివరాలను ధృవీకరించడం, తప్పులను సరిచేయడం, కొత్త అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని ఎన్నికల సంఘం తెలిపింది
ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు సాధారణంగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలు ధృవీకరిస్తారు. అవసరమైతే వివరాల్లో మార్పులు, చిరునామా సవరణలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాలను నమోదు చేస్తారు అధికారి ఇంటికి వచ్చిన సమయంలో ఇల్లు తాళం వేసి ఉంటే ఏమవుతుంది? దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉంటే బూత్ స్థాయి అధికారి వెంటనే ఓటరు పేరును తొలగించరు. ముందుగా ఇంటి వద్ద సమాచారం వదిలి వెళ్లడం లేదా కుటుంబంలోని పెద్దవారికి ఫారాన్ని అందించడం జరుగుతుంది. అవసరమైతే మరోసారి ఇంటికి వచ్చి వివరాలను సేకరిస్తారు. అధికారులు కనీసం మూడు సార్లు ప్రయత్నించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది
Fetching videos...
Fetching latest news...
No trending news