మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చేతన్ చౌధరిని నేరస్థలంతో అనుసంధానించేందుకు పోలీసులు ఇప్పుడు అత్యాధునిక ఫోరెన్సిక్ సాంకేతికతను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా గైట్ అనాలిసిస్ అనే నడక తీరు విశ్లేషణ విధానాన్ని ఉపయోగించి, సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన వ్యక్తి చేతన్ చౌధరేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే వందలాది మందిని ప్రశ్నించిన దర్యాప్తు బృందం, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ వీడియోలు, నేరస్థల పునర్నిర్మాణం వంటి అన్ని కోణాల్లో విచార
పోలీసుల కథనం ప్రకారం, లోహగడ్ కోట సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో ఒక వ్యక్తి ముఖాన్ని పూర్తిగా కప్పుకుని కనిపించాడు. హూడీ ధరించడం వల్ల ముఖాన్ని గుర్తించడం సాధ్యం కాకపోవడంతో, అతని నడక తీరు, శరీర కదలికలు, అడుగుల వేగం, భుజాల కదలిక వంటి లక్షణాలను శాస్త్రీయంగా విశ్లేషించాలని నిర్ణయించారు. దీనికోసం చేతన్ చౌధరితో అదే తరహాలో నడకను రికార్డు చేసి, సీసీటీవీ దృశ్యాలతో పోల్చనున్నారు.
ణను వేగవంతం చేసింది
Fetching videos...
Fetching latest news...
No trending news