13 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా, ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించింది. ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా మంచి రన్ కొనసాగిస్తూ 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం పెద్ద పోటీ లేకపోవడంతో కలెక్షన్లు ఇంకా పెరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలను నందిని రెడ్డి బయటపెట్టారు. ముఖ్యంగా సమంత వ్యక్తిగత జీవితం గురించి తెలిసిన తర్వాతే కొన్ని ముఖ్యమైన సీన్లు షూట్ చేశామని ఆమె వెల్లడించారు. షూటింగ్ సమయంలోనే సమంత తనకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పిందని, అది చాలా సీక్రెట్గా ఉంచాలని కోరిందని నందిని రెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఒక సాంగ్ షూట్ కోసం మొదట నాలుగు రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశామని, కానీ సమంతకు ఆరోగ్యం బాగోలేక జ్వరం రావడంతో ఆ షెడ్యూల్ను రెండు రోజుల్లోనే పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో కూడా సమంత ఎంతో డెడికేషన్తో పనిచేసిందని ఆమె ప్రశంసించారు. తరచూ జ్వరం రావడంతో ఆమె పరిస్థితి గమనించి, డాన్స్ మాస్టర్కు ప్రత్యేకంగా చెప్పి ఎక్కువ శ్రమ పెట్టకుండా, చిన్న చిన్న స్టెప్పులతోనే పాటను పూర్తి చేశామని తెలిపారు.
తర్వాత కాలంలోనే సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టిందని, ఆ సమయంలో తాను ఎంతో జాగ్రత్తలు తీసుకున్నట్లు నందిని రెడ్డి చెప్పారు. యాక్షన్ సీన్లు, కార్ ఛేజ్ సీక్వెన్సులు, కొన్ని ఎమోషనల్ కీలక సన్నివేశాలు అన్నీ తర్వాత ప్లాన్ చేసి షూట్ చేశామని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా షూటింగ్ను ఎక్కువగా ఎండలో కాకుండా సాయంత్రం 3:30 తర్వాత నీడలోనే చేశామని, సమంతకు ఎలాంటి ఒత్తిడి కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ మొత్తం సమయంలో సమంత ఆరోగ్యం, సేఫ్టీనే ప్రధానంగా చూసుకున్నామని నందిని రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమె ప్రొఫెషనలిజం మాత్రం తగ్గలేదని, ప్రతి సీన్ను పూర్తి శ్రద్ధతో చేసినట్లు తెలిపారు. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడంలో సమంత పాత్ర చాలా కీలకమని ఆమె అన్నారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత డెడికేషన్, టీమ్ వర్క్పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “మా ఇంటి బంగారం” సినిమా విజయంతో పాటు దాని వెనుక ఉన్న ఈ ఎమోషనల్ స్టోరీ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news