అమెరికాలోని న్యూయార్క్ నగరానికి ప్రతీకగా నిలిచే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ఓ జంట చేసిన సాహసం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆకాశహర్మ్యాల్లో ఒకటైన ఈ భవనం శిఖర భాగానికి అనుమతి లేకుండా చేరుకున్న ఓ రష్యన్ జంట, అక్కడే నిశ్చితార్థం చేసుకుని అనంతరం పోలీసుల అదుపులోకి వెళ్లింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. రష్యాకు చెందిన 33 ఏళ్ల ఏంజెలా నికోలౌ మరియు 32 ఏళ్ల ఇవాన్ బీర్కస్ ఈ సాహసానికి పాల్పడ్డారు. ఎత్తైన భవనాలు, నిర్మాణాలపైకి ఎక్కి చిత్రాలు, దృశ్యాలు చిత్రీకరించడం ద్వారా ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందిన ఈ జంట, తాజాగా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను తమ ప్రేమకు వేదికగా ఎంచుకుంది న్యూయార్క్ నగర మధ్యలో ఉన్న ఈ చారిత్రక భవనం శిఖరంలోని సూది ఆకారపు పైభాగానికి చేరుకున్న వారు అక్కడ ఒక పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఆ బ్యానర్‌పై “ప్రేమ శక్తి అధికార ప్రేమను జయించినప్పుడు ప్రపంచానికి శాంతి లభిస్తుంది” అనే సందేశం రాసి ఉంది. ఈ సందేశం కూడా అనేక మందిని ఆకర్షించింది
ఈ సాహస యాత్రలో అత్యంత ఆసక్తికర ఘట్టం అక్కడే చోటుచేసుకుంది. భవనం అగ్రభాగంలో నిలబడి ఉన్న సమయంలో ఇవాన్ బీర్కస్ ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని ఏంజెలాకు ఉంగరం అందిస్తూ వివాహ ప్రతిపాదన చేశాడు. ఆమె అంగీకరించడంతో ఇద్దరూ పరస్పరం ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు చిత్రీకరించబడి అనంతరం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందాయి.
అయితే ఈ రొమాంటిక్ క్షణాల వెనుక భద్రతా నిబంధనల ఉల్లంఘన అంశం కూడా ఉంది. ప్రపంచ ప్రఖ్యాత భవనం పైభాగానికి అనుమతి లేకుండా చేరుకోవడం భద్రతా పరంగా తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు భావిస్తున్నారు. అందువల్ల వారు కిందికి దిగిన తర్వాత పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
.Fetching videos...
Fetching latest news...
No trending news