భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం చేయడంపై మాజీ ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐర్లాండ్‌తో జరిగిన ట్వంటీ–20 సిరీస్‌లోనే అతడికి అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. అలాంటి నెమ్మదైన పిచ్‌లు, చిన్న మైదానాల్లో వైభవ్ తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చాటేవాడని అన్నారు. అతడిలో జట్టుకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యం ఉందని, నిర్భయంగా ఆడే స్వభావం మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదని పేర్కొన్నారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడిని వరుసగా బెంచ్‌పైనే ఉంచడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు. వీలైనంత త్వరగా అతడిని తుది జట్టులోకి తీసుకురావాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో కూడా వైభవ్ అరంగేట్రంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రవి శాస్త్రి వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news