అయోధ్య శ్రీరామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ధామ్‌లో కూడా విరాళాల మాయం జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని శ్రీ బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఆదేశాలు జారీ చేసింది. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు వాస్తవాలు వెలికితీసి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఆరోపణల ప్రకారం, బద్రీనాథ్ ఆలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాలు, కానుకల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. కొన్ని విరాళాల లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, వాటి నిర్వహణలో పారదర్శకత లేదని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం వేగంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు విచారణలో భాగంగా విరాళాల సేకరణ, లెక్కింపు, భద్రపరచడం, ఖజానాకు తరలింపు, లెక్కల నమోదు వంటి అన్ని ప్రక్రియలను పరిశీలించనున్నారు. అవసరమైతే సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు తీసుకోవడంతో పాటు, సీసీటీవీ దృశ్యాలు, లావాదేవీల రికార్డులు, ఖాతాల వివరాలను కూడా పరిశీలించనున్నట్లు సమాచారం. కొన్ని ఉద్యోగులు, ఆలయ కమిటీ అధికారులతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి
ఈ వివాదం రావడానికి కొద్ది రోజుల ముందే అయోధ్య శ్రీరామ మందిరంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతుండగా, ఆలయ నిధుల నిర్వహణపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో బద్రీనాథ్‌లో కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో భక్తుల్లో ఆందోళన పెరిగింది.
ఈ పరిణామాల నేపథ్యంలో బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ అన్ని ఆలయాలకు కఠిన ఆర్థిక నిర్వహణ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. విరాళాల సేకరణ, లెక్కింపు, భద్రత, ఖాతాల నిర్వహణలో సంపూర్ణ పారదర్శకత పాటించాలని, నగదు లేదా ఇతర కానుకల విషయంలో నిర్లక్ష్యం, అక్రమాలు అస్సలు సహించబోమని స్పష్టం చేసింది. ఆలయాల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది
Fetching videos...
Fetching latest news...
No trending news