దేశ రాజధాని ఢిల్లీలో ఆహార భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారిన భారీ నకిలీ ఆహార రాకెట్‌ను భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు, ఢిల్లీ పోలీసులతో కలిసి ఛేదించారు. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులపై కొత్త తయారీ, గడువు తేదీలను ముద్రించి వాటిని తాజాగా తయారైన ఉత్పత్తుల్లా విక్రయిస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో సుమారు 40 వేలకుపైగా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కోట్ల రూపాయల విలువైన ఆహార నిల్వలను సీజ్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది
దర్యాప్తు ప్రకారం, ఈ ముఠా పరిశ్రమల ప్రాంతంలో గోదామును ఏర్పాటు చేసి, గడువు ముగిసిన బిస్కెట్లు, చాక్లెట్లు, పానీయాలు, స్నాక్స్, సాస్‌లు, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను పెద్దఎత్తున నిల్వ చేసేది. అనంతరం ప్రత్యేక యంత్రాల సహాయంతో అసలు లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త తయారీ తేదీ, కొత్త గడువు తేదీతో నకిలీ స్టిక్కర్లు అంటించి మార్కెట్లోకి పంపించేది. బయటకు చూస్తే ఇవి కొత్త ఉత్పత్తుల్లా కనిపించేలా అత్యంత నైపుణ్యంతో ప్యాకేజింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
దాడుల సమయంలో సుమారు 40 వేలకుపైగా గడువు ముగిసిన ఆహార ప్యాకెట్లు, భారీ పరిమాణంలో పానీయాలు, లేబుళ్లు ముద్రించే యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రి, నకిలీ స్టిక్కర్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో సంస్థ యజమానితో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news