విజయవాడలో గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్‌పై లభించిన ఎముకలు, బూడిద, స్టీల్ బ్రాస్లెట్ వంటి వస్తువులను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. న్యాయాధికారి సమక్షంలో అన్ని వస్తువులను సీల్ చేసి ల్యాబ్‌కు తరలించినట్లు సమాచారం.
ఈ వస్తువులు గాదె సాయికృష్ణవేనా కాదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక ద్వారా నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేసు దిశను మార్చేలా ఈ ఆధారాలు కీలకంగా మారనున్నాయి.
అదే సమయంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డీఎన్ఏ నమూనా సేకరించే యోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. లభించిన అవశేషాలతో డీఎన్ఏ సరిపోల్చడం ద్వారా అసలు విషయం నిర్ధారించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news