ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ ప్రముఖ పాప్ గాయని కైలీ మినోగ్ గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పారు. గత వారం ప్రసారమైన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా వివాదానికి దారితీయగా, మహిళలను అవమానించేలా ఉన్నాయని ప్రతిపక్షం సహా పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. విమర్శలు మరింత పెరగడంతో సోమవారం అల్బనీస్ అధికారికంగా తన వ్యాఖ్యలకు "బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను" అని ప్రకటించారు.
ఈ వివాదం ప్రముఖ హాస్యనటి నిక్కీ ఓస్బోర్న్ నిర్వహిస్తున్న "బుష్ డీప్" పాడ్కాస్ట్లో జరిగిన ఇంటర్వ్యూతో ప్రారంభమైంది. సుమారు 20 నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణలో నిక్కీ ఓస్బోర్న్, ఆస్ట్రేలియా ప్రధానికి సరదాగా ఒక ప్రశ్న అడిగారు. ప్రముఖ గాయని కైలీ మినోగ్, హాలీవుడ్ నటి నికోల్ కిడ్మన్, వినోద రంగానికి చెందిన రొండా బర్చ్మోర్లలో ఎవరిని ఎంచుకుంటారనే రీతిలో ఆమె ప్రశ్నించారు.మొదట ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రధాని అల్బనీస్, అనంతరం "కైలీ, స్పష్టంగా కైలీ" అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. మహిళలను గౌరవించాల్సిన అత్యున్నత ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పలువురు విమర్శించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news