ఫిఫా ప్రపంచ కప్ 2026లో అమెరికా ఆటగాడు పోలారిన్ బలోగన్‌పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా ఎత్తివేయడం అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి దారితీసింది. బోస్నియా-హెర్జెగొవినాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ప్రత్యర్థిని కాలుతో అడ్డుకున్న కారణంగా బలోగన్‌కు రిఫరీ రెడ్ కార్డ్ చూపించగా, సాధారణ నిబంధనల ప్రకారం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు.
అయితే అనూహ్యంగా ఫిఫా క్రమశిక్షణ కమిటీ ఆ సస్పెన్షన్‌ను నిలిపివేయడంతో బలోగన్ బెల్జియంతో జరిగే కీలక ప్రిక్వార్టర్ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ నిర్ణయం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఉందన్న వార్తలు బయటకు రావడంతో క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చ మొదలైంది.
అమెరికా ప్రభుత్వ అధికారి ప్రకారం, ట్రంప్ నేరుగా ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే అప్పీల్ ప్రక్రియ వేగం పుంజుకుంది. అనంతరం అమెరికా తరఫున అదనపు ఆధారాలు సమర్పించగా, స్వతంత్ర కమిటీ వాటిని పరిశీలించి నిషేధాన్ని రద్దు చేసినట్లు సమాచారం.
ఈ పరిణామంపై బలోగన్ ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో మూడు గోల్స్‌తో కీలక ఆటగాడిగా నిలిచాడు. అతనిపై నిషేధం ఎత్తివేయడాన్ని ట్రంప్ స్వాగతిస్తూ “ఫిఫా సరైన నిర్ణయం తీసుకుంది” అని సోషల్ మీడియాలో స్పందించారు.
అయితే ఈ నిర్ణయంపై బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ సస్పెన్షన్ రద్దు చేయడం అన్యాయమని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
నార్వే ప్రధాన కోచ్ స్టాలే సోల్బక్కెన్ కూడా ఫిఫాపై విమర్శలు గుప్పిస్తూ, “రెడ్ కార్డ్ తర్వాత నిషేధం తప్పనిసరి. రాజకీయ ఒత్తిడితో నిర్ణయాలు మారితే ప్రపంచ కప్ విశ్వసనీయత దెబ్బతింటుంది” అని వ్యాఖ్యానించాడు.
ఈ ఘటనతో క్రీడల్లో రాజకీయ జోక్యం ఎంతవరకు సరైనది అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చ ప్రారంభమైంది.
Fetching videos...
Fetching latest news...
No trending news