రష్యాలో పెరుగుతున్న ఇంధన కొరత దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల రోజువారీ జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా కీలక చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తుండగా, కొన్నిచోట్ల ఇంధన విక్రయాలపై పరిమితులు కూడా విధించబడ్డాయి. ఈ పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై తన వైఖరిని మార్చుతారా అనే ప్రశ్న అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది ఈ దాడుల ప్రభావంతో రష్యాలో పెట్రోల్ ఉత్పత్తి తగ్గింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి ఇంధనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వాహనదారులు తక్కువ ధరలో లభించే ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) వాహనాలుగా తమ కార్లను మార్చించుకోవడానికి భారీగా ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పిడి సేవలు అందించే కేంద్రాల వద్ద కూడా నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది
ఉక్రెయిన్ గత కొన్ని నెలలుగా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన నిల్వ కేంద్రాలు, రవాణా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు ముమ్మరం చేసింది. ఈ దాడుల ఉద్దేశం రష్యా యుద్ధ యంత్రాంగానికి అవసరమైన ఇంధన సరఫరాను దెబ్బతీయడంతో పాటు, చమురు ఆదాయంపై ఆధారపడిన రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా దేశంలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన ఓమ్స్క్ రిఫైనరీపై జరిగిన దాడి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందిFetching videos...
Fetching latest news...
No trending news