శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆడపిల్లలు, మహిళల జోలికి రావాలంటేనే భయపడే విధంగా చట్టాలను అమలు చేయాలని మాధవ్ సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
పిల్లల భద్రత విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యత నుంచి తప్పించుకోలేరని మాధవ్ స్పష్టం చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తులు, సంబంధిత వ్యవస్థలు విద్యార్థుల రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాప్తాడు ఘటనపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాలికల భద్రత, పాఠశాలల్లో రక్షణ చర్యలపై మరోసారి చర్చకు దారితీశాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news