ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న రహదారి పనుల్లో ఎలాంటి ఉదాసీనత సహించబోమని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. డోలి రోడ్ల నిర్మాణంపై ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, పనులు గడువులోపు పూర్తిచేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
పనుల్లో జాప్యం జరగకుండా మెటీరియల్ సరఫరా సక్రమంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, కాంట్రాక్టర్లు వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. డెత్ వర్క్, రోలింగ్, కాంపాక్షన్ పూర్తైనా లేయర్ పనులు ఆలస్యం అవుతున్నాయని గుర్తించి, గ్రౌండ్ లెవల్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వచ్చే నెల 10వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ఫీల్డ్‌లో నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రతిరోజూ పనుల పురోగతిపై ఫోటోలు, వీడియోలు సమర్పించాలని ఆదేశించారు. ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. ఈ సమీక్షలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news