దాదాపు రెండువేల ఏళ్లుగా మానవ కంటికి అందని ఓ ప్రాచీన గ్రంథాన్ని కృత్రిమ మేధ మరోసారి చరిత్రలో నిలిచేలా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇటలీలోని హెర్క్యులేనియం ప్రాంతంలో లభించిన పీహెచ్ఈఆర్సీ 1667 అనే పాపిరస్ గ్రంథం క్రీ.శ. 79లో వెసూవియస్ అగ్నిపర్వతం విస్ఫోటనం సమయంలో బూడిద, వేడి కారణంగా పూర్తిగా కాలిపోయి నల్లటి కార్బన్ ముద్దలా మారిపోయింది. దాన్ని విప్పే ప్రయత్నం చేస్తే శాశ్వతంగా నాశనం అయ్యే ప్రమాదం ఉండటంతో దాదాపు రెండు సహస్రాబ్దాలుగా దాని లోపలి విషయం రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడు కృత్రిమ మేధ, అధిక సామర్థ్యం గల ఎక్స్‌రే పరిశోధనలో అమెరికాలోని కెంటకీ విశ్వవిద్యాలయం, ఇటలీలోని నేపుల్స్ పరిశోధకులు, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కలిసి పనిచేశారు. ముందుగా గ్రంథాన్ని అత్యంత సూక్ష్మ స్థాయిలో ఎక్స్‌రే చిత్రాల ద్వారా స్కాన్ చేశారు. అనంతరం యంత్ర అభ్యాస ఆధారిత కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ పాపిరస్పై కనిపించని సిరా ఆనవాళ్లను గుర్తించి, చుట్టుకుపోయిన పొరలను డిజిటల్‌గా విడదీసి చదవదగిన రూపంలోకి మార్చింది. ఈ విధానాన్ని “వర్చువల్ అన్రోలింగ్”గా పిలుస్తారు. దీని ద్వారా సుమారు 1.4 నుంచి 1.5 మీటర్ల పొడవులో ఉన్న గ్రీకు భాషా గ్రంథాన్ని వరుసగా చదవడం సాధ్యమైంది.
శాస్త్రవేత్తల ప్రకారం, ఈ గ్రంథంలో సుమారు 22 కాలమ్‌ల గ్రీకు రచన ఉంది. ఇందులో నైతికత, మానవ స్వభావం, జ్ఞానం, ఆలోచనా విధానం వంటి తాత్విక అంశాలపై చర్చించినట్లు గుర్తించారు. ఈ రచన స్టోయిక్ తత్వశాస్త్రానికి చెందినదై ఉండొచ్చని, ప్రసిద్ధ తత్వవేత్త క్రిసిప్పస్ శిష్య వర్గంతో సంబంధం ఉండే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. గ్రంథంలోని ఒక భాగంలో అరిస్టోక్రియోన్ అనే పేరు కూడా కనిపించడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది
గ్, డిజిటల్ పునర్నిర్మాణ సాంకేతికతల సహాయంతో పరిశోధకులు ఆ గ్రంథాన్ని భౌతికంగా తెరవకుండానే పూర్తిగా చదవగలిగారు.Fetching videos...
Fetching latest news...
No trending news