అవనిగడ్డ మండలం రామకోటిపురానికి చెందిన గోపరాజు అజయ్, కొత్తపేటకు చెందిన శ్రీ యామినిల వివాహం పులిగడ్డలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. అనంతరం రామకోటిపురంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో నూతన దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు హాజరై నూతన దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. వ్రతంలో పాల్గొని సత్యనారాయణ స్వామి పూజలో కూడా ఆయన పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా సాగింది.
Fetching videos...
Fetching latest news...
No trending news