కాల్గరీ స్టాంపీడ్ ఉత్సవాల సందడి మధ్య అల్బెర్టా కెనడాలోనే కొనసాగాలా, లేక ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవాలా అనే అంశంపై జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) ప్రధాన చర్చగా మారింది. ప్రతి సంవత్సరం ఉత్సాహంగా జరిగే ఈ సాంస్కృతిక వేడుక ఈసారి రాజకీయ వేడిని కూడా సంతరించుకుంది.అయితే ఈ ఏడాది స్టాంపీడ్ వేడుకలపై రాజకీయ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబరులో జరగనున్న ఓటింగ్‌లో అల్బెర్టా ప్రజలు కెనడాలో కొనసాగాలా లేదా భవిష్యత్తులో పూర్తిస్థాయి విభజనపై మరో బైండింగ్ రెఫరెండం నిర్వహించాలా అనే అంశంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. ఈ ఓటింగ్ అల్బెర్టా రాజకీయ చరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది.
అల్బెర్టాలో విభజన భావజాలం కొత్తది కాదు. ఈ ప్రావిన్స్‌లో చమురు, సహజ వాయువు వంటి సహజ వనరులు విస్తారంగా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు అల్బెర్టా గణనీయమైన ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, తమ ఆర్థిక ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావన కొంతమంది ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఇంధన రంగంపై ఫెడరల్ విధానాలు, పర్యావరణ నిబంధనలు, పన్నుల పంపిణీ వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news