యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో తొలి మహిళా ప్రధాన కథా చిత్రంగా తెరకెక్కిన ‘ఆల్ఫా’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు జరిగిన అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ చిత్రం దాదాపు రూ.3.06 కోట్ల వసూళ్లు సాధించి మంచి స్పందనను అందుకుంది. ముఖ్యంగా హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే అంశం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
దర్శకుడు శివ్ రావైల్ తెరకెక్కించిన ఈ చిత్రం యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ‘టైగర్’, ‘పఠాన్’, ‘వార్’ చిత్రాలతో విస్తరించిన ఈ సినీ విశ్వంలో తొలిసారిగా మహిళా గూఢచారిణుల కథను ప్రధానాంశంగా తీసుకొచ్చారు. ఆలియా భట్, శర్వరి ఇద్దరూ అత్యాధునిక శిక్షణ పొందిన ఏజెంట్లుగా కనిపిస్తుండగా, బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. అనిల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషించారు.
అడ్వాన్స్ బుకింగ్ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా వేలాది షోల కోసం దాదాపు 90 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. బ్లాక్ సీట్లను మినహాయించి రూ.3.06 కోట్లకు పైగా వసూళ్లు నమోదవగా, బ్లాక్ బుకింగ్‌లతో కలిపితే ఈ సంఖ్య మరింత పెరిగింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి ప్రాంతాల్లో మంచి స్పందన కనిపించింది. వారాంతంలో ప్రేక్షకుల స్పందన ఆధారంగా తొలి రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి
Fetching videos...
Fetching latest news...
No trending news