అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 'ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు–2026'ను రేపు పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే లోక్సభ స్పీకర్ కార్యాలయానికి అధికారికంగా సమాచారం అందించింది. ఈ బిల్లును రేపు ఉదయం నిర్వహించనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సవరణ బిల్లుతో అమరావతి రాజధాని అంశానికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియను మరింత బలపరచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. దీని ద్వారా రాజధాని నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు స్పష్టత, వేగం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనపై ప్రభావం చూపే కీలక అడుగుగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news