సిద్ధవటం మండలంలోని సిద్ధవటం, భాకరాపేట ఐసీడీఎస్ సెక్టార్లలో 4 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కడప అర్బన్ ఐసీడీఎస్ సీడీపీవో శోభారాణి తెలిపారు. సిద్ధవటం పోలీస్ స్టేషన్ సమీపంలోని 1వ వార్డు (ఓసి), భాకరాపేట (బీసీ-ఎ), మాధవరం-1 (బీసీ-బి), మహబూబ్నగర్ (ఏడబ్ల్యుఎస్) కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్
13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఐసీడీఎస్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలనీ, అర్హత ప్రమాణాలను పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news