బ్రిటన్ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసిన మాజీ కన్జర్వేటివ్ ఎంపీ, మాజీ ప్రభుత్వ మంత్రి, రిఫార్మ్ యూకే ప్రతినిధి ఆన్ విడికోంబ్ మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆమె మరణానికి సంబంధించి హత్య అనుమానంతో 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు డెవాన్ అండ్ కార్న్వాల్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అరెస్టు చేసిన వ్యక్తి బ్రిటిష్ జాతీయుడని, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంచి విచారిస్తున్నట్లు వెల్లడించారు. 78 ఏళ్ల ఆన్ విడికోంబ్ మృతదేహం గురువారం ఉదయం డెవాన్లోని డార్ట్మూర్ ప్రాంతంలోని హేటర్ గ్రామంలో ఉన్న ఆమె నివాసంలో తీవ్ర గాయాలతో పోలీసులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 11:40 గంటలకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో ఈ ఘటనను అనుమానాస్పద మరణంగా పరిగణించి విచారణ చేపట్టారు.దర్యాప్తు ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు న్యూటన్ అబ్బాట్ ప్రాంతంలోని ఒక చిరునామాలో 26 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య అనుమానంతో కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడికి బాధితురాలితో ముందుగా పరిచయం ఉందా లేదా అనే అంశంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున మరిన్ని వివరాలను వెల్లడించడం సముచితం కాదని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసు ప్రారంభ దశలో ఉగ్రవాద నిరోధక విభాగం కూడా పాల్గొన్నప్పటికీ, ప్రస్తుతం ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రారంభ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా అన్ని కోణాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఉగ్రవాద సంబంధిత ఆధారాలు లభించలేదని వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news