రాష్ట్రంలో 2029 నాటికి ఇళ్లు లేని పేదలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం 17 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని వేగంగా పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. 2014–19 మధ్య కాలంలో 8.19 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి పేదలకు అందించామని వివరించారు.
గత పాలకుల హయాంలో వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని, వాటిని క్రమబద్ధీకరించే పనిలో ప్రభుత్వం ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 6.5 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించగా, తమ ప్రభుత్వం 21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించిందని తెలిపారు. పేదలకు గృహ సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news