చిత్తూరు నియోజకవర్గంలో మహిళా సాధికారత, అభివృద్ధి అంశాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు సూచనల మేరకు నియోజకవర్గ పరిశీలకురాలు డా. పూరిమిట్ల కుమారి ఆధ్వర్యంలో 50వ వార్డు అధ్యక్షుడు గోపి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలతో సమావేశమైన డా. కుమారి రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
డా. పూరిమిట్ల కుమారి మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. రోడ్లు, తాగునీటి వసతి, విద్య, వైద్యం, రైతుల సంక్షేమం వంటి రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు.
మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల ఆదరణతో నాయకులను గెలిపించే శక్తి మహిళలకు ఉందని పేర్కొన్నారు. మహిళల ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గంలో మహిళలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహిళల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలను డా. కుమారి వివరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచారని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా అనేక మంది మహిళలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఎన్నికై ప్రజా సేవలోకి వచ్చారని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడంలో డ్వాక్రా సంఘాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. కుటుంబ నిర్వహణతో పాటు ఆర్థికంగా ఎదిగే అవకాశాలను మహిళలకు కల్పించడంలో ఈ కార్యక్రమాలు ఉపయోగపడ్డాయని చెప్పారు.
మహిళల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను డా. కుమారి వివరించారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. మహిళల అభ్యున్నతి, కుటుంబాల ఆర్థిక స్థిరత్వం కోసం మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ సమావేశంలో మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టౌన్ అధ్యక్షురాలు నళిని, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనురాధ, వార్డు జనరల్ సెక్రటరీ భాను బేబీ, పద్మిని, రామేశామ్మ, గ్రామీణ మహిళా అధ్యక్షురాలు రేవతి, బుజ్జిరావు, ప్రతిభ, జమున, సుమతి తదితరులు పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యంతో సమావేశం విజయవంతంగా నిర్వహించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news