వంగర మండలం అరసాడ గ్రామ పంచాయతీలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాశ్వత భవన నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 25వ తేదీన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాజాం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి కృష్ణమూర్తి తెలిపారు.
ప్రస్తుతం వెల్నెస్ సెంటర్లో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాశ్వత భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
పీహెచ్సీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంలో గ్రామ పెద్దల సహకారం, ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చేసిన కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. నిధుల కోసం పలుమార్లు అమరావతికి వెళ్లి అధికారులు, నాయకులతో చర్చించి సహకారం అందించిన ఎమ్మెల్యేకు గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
శాశ్వత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news