రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన గృహాలను ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.50 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తున్నామని, పార్వతీపురం నియోజకవర్గంలో 23,000 మందికి గృహాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. నర్సిపురం గ్రామంలోనే 444 మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకుంటున్నారని వెల్లడించారు.
గత ప్రభుత్వం ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కల్పిస్తామని, ఒంటరి మహిళలకు కూడా ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు.
ప్రజల ఇళ్లలో గృహప్రవేశాలు జరగడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news