అవనిగడ్డ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
“కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు, రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం” అనే పేరుతో నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో గురువారం విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలను కలుసుకున్నారు.
అవనిగడ్డ పంచాయతీలోని ఒకటో వార్డులో ఇంటింటికి వెళ్లిన విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, యువనేత నారా లోకేష్ సూచనలతో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని విక్కుర్తి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని విక్కుర్తి కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, సంక్షేమ పథకాల కొనసాగింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న పనులను నేరుగా వివరించడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు మరింత బలపడతాయని నాయకులు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మమేకమవుతున్నాయి. స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రజల మద్దతుతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత వేగం తీసుకువస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, విక్కుర్తి రాంబాబు, క్లస్టర్ ఇన్చార్జ్ బండే రాఘవ, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, అశ్వరావుపాలెం నీటి సంఘాల అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
అలాగే అవనిగడ్డ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కంచర్ల ఆనంద్, కొల్లూరి వాసు, డేగల రాఘవ, మెగావత్తు గోపి, లుక్కా శ్రీనివాసరావు, నాగిడి రాంబాబు, లింగం బాబురావు, జటావత్తు శ్రీను, పిరాటి రాంబాబు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news