గోధుమ చపాతీలు, రోటీలు ఇప్పుడు చాలా మంది రోజువారీ ఆహారంలో భాగమయ్యాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం వీటిని సరైన విధంగా తీసుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. గోధుమలను శరీరానికి బలాన్నిచ్చే, వాత–పిత్త దోషాలను సమతుల్యం చేసే ఆహారంగా పేర్కొంటారు. అయితే కొత్త గోధుమల కంటే కనీసం ఏడాది పాత గోధుమలను ఉపయోగించడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పాత గోధుమలు సులభంగా జీర్ణమవడంతో పాటు కఫాన్ని పెంచవని చెబుతున్నారు. అలాగే చపాతీలను వేడిగా, తాజాగా తినడం, జీర్ణశక్తికి అనుగుణంగా మితంగా తీసుకోవడం కూడా ముఖ్యమని పేర్కొంటున్నారు. సరైన పద్ధతిలో గోధుమలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం సూచించిన ఈ నియమాలు పాటిస్తే గోధుమల వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news