బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రవాణాశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని హైవేల అభివృద్ధి, విస్తరణ, పెండింగ్ సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
హైవే ప్రాజెక్టులకు సంబంధించి టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా పనులు, పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా బనగానపల్లెలో ఉన్న 2 లేన్ల రోడ్డును 4 లేన్లుగా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదించారు.
తమ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
Fetching videos...
Fetching latest news...
No trending news