విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ సీనియర్ కార్యకర్త చిటికెల ఆంజనేయులు గారిని యువ నాయకులు బొండా సిద్ధార్థ గారు పరామర్శించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఆయన నివాసానికి వెళ్లి ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు వైద్య ఖర్చుల నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యకర్తల సంక్షేమమే తమ ప్రధాన బాధ్యత అని బొండా సిద్ధార్థ గారు పేర్కొన్నారు.
పార్టీ కోసం దీర్ఘకాలంగా సేవలందించిన ప్రతి కార్యకర్తకు కష్టకాలంలో అండగా నిలవడం తమ కుటుంబ బాధ్యత అని ఆయన తెలిపారు. ఆంజనేయులు త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ సహాయానికి చిటికెల ఆంజనేయులు గారు మరియు వారి కుటుంబ సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారికి, బొండా సిద్ధార్థ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news