మార్గదర్శులు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి వారి గౌరవాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మార్గదర్శుల కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రస్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరిట మూడు అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో విశిష్ట మార్గదర్శి అవార్డుతో పాటు ప్రశంసా పత్రాలు, నియోజకవర్గ స్థాయిలో సర్టిఫికెట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. నేటి బంగారు కుటుంబాలే రేపటి మార్గదర్శులు కావాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news