ప్రతి ఇంటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లే, స్టవ్ నాబ్ తిప్పితే గ్యాస్ అందే విధంగా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, భద్రత పరంగా ఇది మరింత మెరుగైన పరిష్కారమని పేర్కొన్నారు.
దీపం-2 పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న నగదు ప్రయోజనాలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజాసేవలో మహిళల భాగస్వామ్యం పెరగాలని సూచించిన ఆయన, భవిష్యత్తులో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పురుషులు కూడా మహిళలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news