ఈ ఏడాది గర్వయాత్రలో అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది తల్లిదండ్రుల భాగస్వామ్యం. తమ పిల్లలను వారు ఎలా ఉన్నారో అలా అంగీకరించడం, వారికి కుటుంబం నుంచి మద్దతు అందించడం సమాజానికి ఎంతో అవసరమనే సందేశాన్ని వారు అందించారు. పిల్లల జీవితాల్లో కుటుంబ అంగీకారం ఎంతో ముఖ్యమని, ప్రేమతో కూడిన సహకారం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల భాగస్వామ్యం పెరగడం వల్ల సమాజంలో అపోహలు తొలగి పరస్పర గౌరవం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.
Fetching videos...
Fetching latest news...
No trending news