చికెన్ వండేటప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య “నీచు వాసన”. ఎంత మసాలాలు వేసినా కొన్నిసార్లు ఆ వాసన పూర్తిగా పోదు. కానీ కొన్ని సింపుల్ కిచెన్ ట్రిక్స్ పాటిస్తే ఆ వాసనను పూర్తిగా తొలగించి, రెస్టారెంట్ స్టైల్ రుచితో చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ముందుగా చికెన్‌ను కర్రీ కట్‌గా తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. చాలామంది ఈ స్టెప్‌ను సీరియస్‌గా తీసుకోరు కానీ ఇదే ముఖ్యమైన భాగం. చికెన్ కడిగే ముందు కొంచెం ఉప్పు, పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే చికెన్‌లోని అసహ్య వాసన చాలా వరకు తగ్గిపోతుంది.
తర్వాత స్ట్రాంగ్ ఫ్లేవర్ కోసం మ్యారినేషన్ చేయాలి. కారం, ఉప్పు, పసుపు వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించి కనీసం 10–15 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు లోపలికి వెళ్లి చికెన్ రుచిగా మారుతుంది.
ఇప్పుడు కర్రీ తయారీ ప్రారంభించాలి. పాన్‌లో నూనె వేడి చేసి బిర్యానీ ఆకులు వేసి ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కర్రీకి బేస్ రుచిని ఇస్తాయి.
ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి హై ఫ్లేమ్‌లో 2–3 నిమిషాలు ఫ్రై చేయాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కలపాలి. ఇది చికెన్‌కు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ ఇస్తుంది.
కర్రీని మరింత టేస్టీగా చేయడానికి అర కప్పు పెరుగు కలపవచ్చు. ఇది గ్రేవీకి క్రీమి టెక్స్చర్ ఇస్తుంది. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 4–5 నిమిషాలు ఉడికించాలి. తరువాత అవసరమైనంత నీరు వేసి చికెన్ పూర్తిగా మెత్తబడే వరకు మరిగించాలి.
సుమారు 15–20 నిమిషాల్లో చికెన్ పూర్తిగా ఉడికిపోతుంది. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా తయారైన చికెన్ కర్రీ ఘాటైన వాసన లేకుండా, చాలా రుచిగా ఉంటుంది.
ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే హాస్టల్లో ఉన్నవాళ్లు కూడా, బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ సమయంలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
Fetching videos...
Fetching latest news...
No trending news