కొత్తగూడెంలోని చుంచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చెత్తను కాల్చడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబుక్యాంప్ వైకుంఠధామం వద్ద ప్రతిరోజూ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో సేకరించిన వ్యర్థాలను తగలబెడుతున్నారని ఆరోపించారు.
చెత్త దహనం వల్ల వెలువడుతున్న పొగ, దుర్వాసనతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని స్థానికులు తెలిపారు. వైకుంఠధామం సమీపంలో పోలీస్ స్టేషన్, సీఎంపీఎస్ కార్యాలయం, పాఠశాల, ఐటీఐ సంస్థలు ఉండటంతో పాటు వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు.
వ్యర్థాల కాల్చివేత కారణంగా విద్యార్థులు కళ్ల మంటలు, శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, పంచాయతీ అధికారులు, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు స్పందించి చెత్త దహనాన్ని నిలిపివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news