మలబద్ధకం అనేది చాలా మంది చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేసే సాధారణ జీర్ణ సమస్య. అయితే దీర్ఘకాలంగా కొనసాగితే ఇది అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గట్టిపడిన మలాన్ని బయటకు పంపేందుకు ఎక్కువగా శ్రమించాల్సి రావడం వల్ల పాయువు ప్రాంతంలోని సిరలు ఉబ్బి పైల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా అనల్ ఫిషర్స్, రెక్టల్ ప్రోలాప్స్, ఫేకల్ ఇంపాక్షన్ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఆకలి తగ్గడం, తీవ్రమైన కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి. మలబద్ధకంతో పాటు మలంలో రక్తం, నిరంతర కడుపు నొప్పి, అకస్మాత్తుగా బరువు తగ్గడం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సమతుల్య ఆహారం, ఎక్కువ నీరు తాగడం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news