బెంగళూరులో ఒక దంపతుల ఆత్మహత్య ఘటన సంచలనం రేపుతోంది. వివరాల ప్రకారం, సిద్ధిపేట జిల్లాకు చెందిన భానుచందర్ రెడ్డి గతేడాది AI కారణంగా ఉద్యోగం కోల్పోయి ఆర్థిక, మానసిక ఒత్తిడికి లోనయ్యారు. అమెరికా నుంచి తిరిగి వచ్చి భార్య షాజియాతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు.
ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన భానుచందర్ రెడ్డి సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను తట్టుకోలేని భార్య షాజియా కేవలం 20 నిమిషాల్లోనే 18వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ వరుస ఘటనలు కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేశాయి.
ఈ ఘటనతో స్థానికంగా దిగ్భ్రాంతి నెలకొంది. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అంశాలు ఇలాంటి దారుణ నిర్ణయాలకు దారితీస్తున్నాయని ఈ ఘటన మరోసారి చూపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటన సమాజంలో మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతను గుర్తు చేస్తోంది. ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితుల్లో తగిన మద్దతు, సహాయం అందించడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news