భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కడప జిల్లా కార్యదర్శిగా దాసరి వెంకటరమణ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట, నందలూరు మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
శాలువాతో సత్కరించిన అనంతరం బీజేపీ శ్రేణులు దాసరి వెంకటరమణ గౌడ్‌కు పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షులు భాను ప్రకాష్ రాజు, నందలూరు మండల అధ్యక్షులు చుక్కా శ్రీనివాసులు, బీజేపీ నాయకులు తోట శ్రీనివాస ధీరజ్, యువ నాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి, రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, కత్తి జగదీష్, వెంకట ప్రతాపరెడ్డి, హరి రాయల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాసరి వెంకటరమణ గౌడ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కోడూరు మల్లికార్జునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, యువత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news