ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఒక అనుమానిత కారు అసెంబ్లీ గేటు వరకు దూసుకొచ్చి గేట్ నెంబర్–2ను ఢీకొట్టి లోపలకు ప్రవేశించినట్లు సమాచారం. ఈ ఘటన భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
మొహానికి మాస్క్ ధరించిన వ్యక్తి కారును నడిపినట్లు తెలుస్తోంది. అనుమానాస్పదంగా లోపలికి వచ్చిన ఆ వాహనం అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం వరకు చేరినట్లు వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘటన సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.
ఈ సంఘటనపై పోలీసులు, భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. వాహనం ఎవరిది, డ్రైవర్ ఉద్దేశ్యం ఏమిటి అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
దేశ రాజధానిలో ఉన్న కీలక ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం భద్రతా లోపాలపై ఆందోళన కలిగిస్తోంది. భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news