ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను క్రైమ్ బ్రాంచ్ అధికారులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారీగా ఆయుధాల డంప్‌ను సీజ్ చేసినట్లు సమాచారం. భద్రతా సంస్థలు సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
విచారణలో నేపాల్ నుంచి భారత్‌కు భారీ స్థాయిలో ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతున్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల ద్వారా అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పలువురు అనుమానితులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
సీజ్ చేసిన ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా తరలించబడ్డాయి అనే అంశాలపై లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ నెట్‌వర్క్‌కు దేశంలో ఎవరెవరు సహకరిస్తున్నారనే కోణంలో కూడా దర్యాప్తు విస్తరించినట్లు సమాచారం.
భద్రతా సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దేశ రాజధానిలో ఇలాంటి కుట్రలు వెలుగులోకి రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news