పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం సరుకును పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ షరీఫ్‌కు అందిన గోప్య సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను ఆపి పరిశీలించారు.
తనిఖీల్లో ఆటోలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు మద్యం రవాణాలో పాల్గొన్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం.
సీజ్ చేసిన మద్యం సరుకుతో పాటు ఆటోను పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిందితులపై కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధంగా మద్యం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news