గోకవరంలో ప్రజా సేవకుడు, టీడీపీ యువ నేత, యూనిట్ ఇంచార్జ్, మాజీ జడ్పీటీసీ, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పాలూరి బోసుబాబు జన్మదిన వేడుకలు అభిమానులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బోసుబాబు జన్మదిన వేడుకలకు పార్టీలకతీతంగా పలువురు నాయకులు, ప్రజలు హాజరయ్యారు.
గోకవరం ప్రాంతంలో బోసుబాబు పట్ల ఉన్న అభిమానాన్ని చాటుతూ భారీగా వేడుకలు నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు గ్రామ పెద్దలు, యువత, ది గోకవరం ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి వర్గంతో మమేకమై ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా పలువురు ఆయనను కొనియాడారు.
ఆదివారం రాత్రి అభిమానుల ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేసి బోసుబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు ఆయనకు గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా డాక్టర్ బోసుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైద్య రంగంలో సేవలందిస్తూ, వేలాది మందికి నాణ్యమైన వైద్య సహాయం అందించడంతో పాటు సమాజ సేవలోనూ చురుకుగా పాల్గొంటున్న వ్యక్తిగా డాక్టర్ బోసుబాబు గుర్తింపు పొందారని అన్నారు. వైద్య సేవను దైవ సేవగా భావించి నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తున్న ఆయన సేవా దృక్పథం ఆదర్శనీయమని ప్రశంసించారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసే నాయకుడిగా బోసుబాబు ప్రత్యేక గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు. వైద్య రంగం, రాజకీయ రంగం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ పాలూరి బోసుబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, అభిమానమే తనకు మరింత బాధ్యతను పెంచుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో కూడా వైద్య సేవతో పాటు ప్రజా సేవలో అదే అంకితభావంతో కొనసాగుతానని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news