గుడ్డు అత్యంత చవకైన, సంపూర్ణ పౌష్టికాహారంగా పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్‌తో పాటు విటమిన్ A, D, E, B12, ఐరన్, జింక్, కోలిన్ వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటు మెదడు అభివృద్ధి, రోగనిరోధక శక్తి, ఎముకల బలం, గుండె ఆరోగ్యం, జుట్టు, గోళ్ల సంరక్షణకు కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని పచ్చసొనపై ఉన్న అపోహలకు కూడా వారు చెక్ పెట్టారు. పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ గుండెకు హానికరం కాదని, ఇందులోని విటమిన్ D, మంచి కొవ్వులు ఆరోగ్యానికి ఉపయోగపడతాయని స్పష్టం చేస్తున్నారు. ఆరు నెలల వయసున్న శిశువుల నుంచి వృద్ధుల వరకు దాదాపు అందరూ గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. కిడ్నీ, జాండిస్, డెంగ్యూ వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లోనూ వైద్యుల సూచన మేరకు గుడ్డు తెల్లసొన తీసుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. అపోహలను నమ్మకుండా సమతుల ఆహారంలో గుడ్డును చేర్చుకుంటే శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సులభంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news